అమ్మ - Amma

Read Book in Telugu

మొదటి భాగం

1.

గుండె కదుముకొనియె నిండుగ నెవ్వరో

పురిటికందు నేను పుట్టగానె

కన్ను తెరువలేదు కనలేదు లోకమ్ము

కన్నతల్లి ప్రేమ గాంచినాను

2.

చీర జింపివేసి చిన్ని పడకజేసి

పక్కలోన తాను పండుకొనియె

చీర మాటయేల చింపును గుండెనే

కన్నతల్లి ప్రేమ గాంచినాను

3.

మాటిమాటికినగు మలమూత్రముల దీయ

పాకివానివోలె పడక దుడిచె

బాధ జెందలేదు బాలింతయయ్యును

కన్నతల్లి ప్రేమ గాంచినాను

4.

కెవ్వుకెవ్వు మనుచు కేకలు వేయుచు

గోలబెట్టగానె లాలిబాడి

కమ్మనైన పాలు కడుపు నిండుగ ద్రాపె

కన్నతల్లి ప్రేమ గాంచినాను

5.

కాళ్ల దన్నునపుడు కండ్ల కద్దుకొనుచు

కాళ్ల ముద్దు గొనెను కన్నతల్లి

లాలి..లాలి..యనుచు లాలించె నా తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

6.

నిదురలోన బెదరి యదురు కొందుననుచు

చేరి గుండెపైన చేయిబెట్టె

కలవరపడ నేను కలత జెందెను తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

7.

ఊపుచుండె లెస్స, ఊయల యందుంచి

నిదురపోవు వరకు కదలకుండ

నేను లేచులోన తానెప్డు లేచెనో

కన్నతల్లి ప్రేమ గాంచినాను

8.

రాత్రులందు నిదుర రాదు నా తల్లికి

పగటిపూట కూడ పండుకొనదు

కనుల దెటుల మూయు? కన్నుల నేనుండ

కన్నతల్లి ప్రేమ గాంచినాను

9.

గుక్కబెట్టి యేడ్వ కుమిలిపోవుచు తల్లి

చీమ దూరెనేమొ చెవుల ననుచు

కడుపు నొప్పియనుచు కలత జెందెను తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

10.

నవ్వుచుండ నేను, నవ్వును నా తల్లి

యేడ్చుచుండ తల్లి యేడ్చుచుండు

ఏమి జెప్పికొందు నేమిటీ బంధమ్ము

కన్నతల్లి ప్రేమ గాంచినాను

11.

బుల్లి బుల్లి మాట బుడుత ప్రాయమునందు

పలుకగానె నేను పలుకు రాక

పరవశించె తల్లి పద్దిమందితో జెప్పి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

12.

బాబు, కన్న, రాజ, బహు పేర్లతో బిల్చి

తనివిదీరదేమొ, కనుల బిలచు

కనులతోడ బల్కి కౌగిలించెను తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

13.

తాను తగ్గిపోయి, తన వయసు మరచి

చిన్నపిల్ల యగుచు నన్ను జేరి

ఆటలాడుచుండె నానంద మొందుచు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

14.

తప్పటడుగు లిడగ తబ్బిబ్బులై తల్లి

సంతసమున మది వసంత మవగ

పడుదు ననుచు నన్ను పట్టుకొనగ బోయె

కన్నతల్లి ప్రేమ గాంచినాను

15.

చందమామ జూపి చల్లగా లాలించి

బుజ్జగించి నన్ను బుజ్జి యనుచు

కోరికోరి పెట్టె గోరుముద్దలు లెస్స

కన్నతల్లి ప్రేమ గాంచినాను

16.

తలకు దెబ్బ దగుల తనకు దగిలినట్లు

తల్లడిల్లిపోవు తల్లి మనసు

చిన్ని దెబ్బకంత చింతను జెందెను

కన్నతల్లి ప్రేమ గాంచినాను

17.

నీళ్లు చల్లుకొనుచు నిండుగా దడువంగ

తొట్టిలోన చేయిపెట్టి నేను

కొట్టినటు నటించి కొట్టలేదులె తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

18.

ఒంటినిండ మట్టి తుంటరి తనమాయె

ఆటలాడి రాగనాదరించి

మట్టిబోవ బోసె తొట్టెడు నీళ్లన్ని

కన్నతల్లి ప్రేమ గాంచినాను

19.

ఈతలాడి రాగ, నిట్టె సైగలు జేసి

ముక్కుపైన వేలు నొక్కి చూపి

నాన్న గొట్టకుండ నన్ను దప్పించెను

కన్నతల్లి ప్రేమ గాంచినాను

20.

పొరుగువారి రేపి పొగరు పనులుజేయ

తగవు లింటిపైకి తరలిరాగ

తప్పు జేయకుమని తప్పుదిద్దెను తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

21.

పడుచువాడ ననుచు పడతులు కొందరు

కన్నువేసి నన్ను గాంఛగానె

చేర నివ్వలేదు చెడిపోదు ననుచును

కన్నతల్లి ప్రేమ గాంచినాను

22.

స్నేహమెవరితోడ జేతునో యనుచును

వేయి కనులతోడ వేచిజూచె

వాడు తిరుగుబోతు వాడేమి ఫ్రెండనె?

కన్నతల్లి ప్రేమ గాంచినాను

23.

కండలరిగి పోయి కట్టెలైనను గాని

హద్దులేని ప్రేమ వద్దు యనుచు

నన్ను జేరనీక నాబట్టలుతికెను

కన్నతల్లి ప్రేమ గాంచినాను

24.

తల్లివద్ద లాడు తండ్రివద్ద భయము

బేర సారములను బేషు బేషు

పైసలిచ్చుచుండె పై ఖర్చు కనుచును

కన్నతల్లి ప్రేమ గాంచినాను

25.

చిన్ననాట రాత్రి సినిమాలు జూచితి

తండ్రి కెఱుకలేక తల్లి చలువ

నేను వచ్చువరకు మేనువాల్చదెపుడు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

26.

జగడమగుచు నుండ రగడేల మనకని

బయటకెళ్ల నీక బతిమిలాడె

తనను ద్రోసిపోవ తావచ్చె వెనువెంట

కన్నతల్లి ప్రేమ గాంచినాను

27.

పట్న మేగునపుడు పై చదువు జదువ

కంట నీరుబెట్టి వెంటవచ్చె

సాగనంపె గుండె సాగరమ్ముగ మార

కన్నతల్లి ప్రేమ గాంచినాను

28.

సెలవులందు రాగ, చిక్కి పోతిననుచు

ముద్ద నోటబెట్టె వద్దటన్న

కడుపునిండె తనకు కడుపు నింపగ నాకు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

29.

మాడు నాముదమ్ము మర్దన జేసియు

చిన్ననాటివోలె నన్ను జూచె

వద్దు నూనెయన్న వదలదు కదలదు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

30.

పెరిగినాడు కొడుకు పెళ్లిజేయుమనుచు

తండ్రితోడ జెప్పి తగవులాడె

తగవులాడి గెలిచె తల్లిదే పైచేయి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

31.

పెండ్లి కుదిరె నాకు పెండ్లి హడావిడి

అమ్మ తీరు జూడ నబ్బురమ్ము

ఆత్ర మెక్కువాయె నట్టిట్టు పరుగిడె

కన్నతల్లి ప్రేమ గాంచినాను

32.

నేలమీదగాదు నింగిపై నడచుచు

ఆనతిచ్చుచుండె నందరికిని

పెద్దమామc బిలిచె పెండ్లిపందిరి వేయ

కన్నతల్లి ప్రేమ గాంచినాను

33.

చుట్టుపక్క వారి చూడగా బిల్చియు

కాఫిలిచ్చుచుండె కమ్మగాను

కోరి నన్ను గూర్చి కొత్తగా జెప్పెను

కన్నతల్లి ప్రేమ గాంచినాను

34.

బంధువర్గమంత ముందుగా వచ్చెను

అమ్మ కోర్కెమీద నాదరమున

సున్నమేసినారు చుట్టాలు పక్కాలు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

35.

మామిడాకులేరి మంచి తోరణముల

కుట్టుమనుచు మరియు కట్టుమనుచు

ఆడువారితోడ నాప్యాయమున జెప్పె

కన్నతల్లి ప్రేమ గాంచినాను

36.

పిండివంటలెల్ల దండిగా జేసెను

తిన్న వారికెల్ల తిన్నయన్ని

అమ్మ దిన్నయటుల అందరెక్కువతిన

కన్నతల్లి ప్రేమ గాంచినాను

37.

కలలు గన్నయటుల కాబోవు కోడలి

గొప్పదనములన్ని కుప్పబోసె

మనసు నిండిపోయె మంచిది మాయమ్మ

కన్నతల్లి ప్రేమ గాంచినాను

38.

వేడి చేయుననుచు వేయి జాగ్రత్తలు

కదలనీయలేదు కన్నతల్లి

దమ్ము గొట్టబోవ దమ్మేది నాకప్డు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

39.

పెండ్లి సమయమందు పెండ్లి హడావిడి

వేల వేల కనులు లీలనుండ

తల్లి కనులు నాడు తడిసె నాకోసమై

కన్నతల్లి ప్రేమ గాంచినాను

40.

చక్కనైన చుక్క చిక్కె భార్యగనాకు

పెండ్లి జేసినారు పెద్దలెల్ల

అమ్మ నాన్నలేమొ అప్పుల పాలైరి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

41.

తల్లినే మరచితి నిల్లాలు వచ్చెను

ప్రేమ సాగరమున నేమి హాయి

కుళ్లు కొనగలేదు కోడలిపై తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

42.

కంటినీటితోడ కార్డులు వ్రాయును

తిరిగి వ్రాయకున్న తిట్టుకొనదు

మరల మరల వ్రాసె మాయమ్మ బంగారు

కన్నతల్లి ప్రేమ గాంచినాను

43.

బాబు బుట్టినాడు బాలింత నా భార్య

సేవజేయ నమ్మ చేరెమమ్ము

నన్ను జూచెనపుడు నా బాబు మాదిరి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

44.

స్నానమెల్ల జేసి, సాంబ్రాణి పొగవేసి

పిల్లవాని వాని తల్లికిచ్చి

మంచి దనుచు నాకు మరికొంత పొగవేనె

కన్నతల్లి ప్రేమ గాంచినాను

45.

పిల్లవాడు పెరిగె తల్లితో పనియేమి?

కోడలత్తలకును గోడమాట!

పయనమాయె తల్లి నయనాలు దడువంగ

కన్నతల్లి ప్రేమ గాంచినాను

46.

మరల బిడ్డ బుట్ట మరలి వచ్చెను తల్లి

పాత తగవులెల్ల పాతిపెట్టి

కోడలమ్మ తోడ కూర్మితో మెలగెను

కన్నతల్లి ప్రేమ గాంచినాను

47.

సెలవులందు యూరు చేరగా నేమేము

వేగ పరుగులిడుచు కౌగిలించి

ముద్దులాడె మమ్ము ముచ్చట దీరంగ

కన్నతల్లి ప్రేమ గాంచినాను

48.

వయసు మీరుకొలది వద్దన్న పనిజేయు

కోపగించుకొన్న కొంత యలుగు

మరు నిముసములోన మరచిపోయెను తల్లి

కన్నతల్లి ప్రేమ గాంచినాను

49.

తరుణి కోర్కె కెవడొ తల్లిగుండెను గోయ

పలికె గుండె రక్తపాతమందు

జారిపడెదవయ్య జాగ్రత్త యనెనంట

కన్నతల్లి ప్రేమ గాంచినాను

50.

అమ్మ ప్రేమకెట్టి అవధులు గనలేము

తల్లి ఋణము దీర్చు తనయుడెవడు?

ఋణమదెటుల దీరు నణువణువమ్మదే!

కన్నతల్లి ప్రేమ గాంచినాను

రెండవ భాగం

51.

నన్ను గన్న యమ్మ నాతల్లి కడుపుపై

చేతులుంచినాను చివరిసారి

పిండమపుడు నేను నిండుగా నీదిన

తావులన్ని మదిని దేవులాడె

52.

మూడునాళ్లు తల్లి మూర్ఛిల్లి యుండియు

శ్వాసబీల్చునట్టి సవ్వడెల్ల

గుఱ్ఱుమనుచు మాదు గుండెలే పిండంగ

కంటినీటి ధార కారుచుండె

53.

నన్ను ఎత్తుకొనుచు చిన్ననాట నెపుడొ

పెనగి ముద్దులిడిన పెదవులిపుడు

తపసుజేయు ఋషుల తలదన్నుచుండెను

చలన మెరుగనట్టి జడధివోలె

54.

రెండు చేతులెత్తి నిండుగా జోడించి

ప్రార్ధనలను జేయు ప్రభువు పేర

ఒక్క చేతితోడ మ్రొక్కను నిన్నని

పక్షవాతమందు పయనమాయె

55.

కోరి బెట్టినట్టి గోరుముద్దలు నేడు

ఙ్ఞాపకముకు వచ్చి ఊపివేయు

నాళముంచి నీకు నారికేళపు నీరు

పోయునపుడు గుండెబోయె నెటులొ!

56.

నిండు జీవితమ్ము నిత్య సుమంగళి

తరము తరము జూచి తరలినావు

మనవరాళ్లు నేడు మాయవ్వ ఏదన్న?

ఏమి జెప్పగలమె? ఏడ్పుదక్క

57.

చావు రానిగాని, సత్యమ్మునే పల్కు

దైవభీతి, ప్రేమ, దయయు గలవు

నీదు జీవితమ్ము నిత్యమ్ము మాకెల్ల

మార్గదర్శకమగు మాట నిజము

58.

నిశ్చలమ్ము నీదు నిర్మల చిత్తమ్ము

క్రైస్తవులకు నెల్ల కన్నువిప్పు

క్రీస్తు కరుణ నీకు మస్తుగా నున్నది

క్రైస్తవమ్మె నీవు వాస్తవమ్ము

59.

'అమ్మ ' అనెడిమాట అనలేము మేమింక

అమ్మ లేనివార, మమ్మయేది?

అపుడు పిలుతుమమ్మ అమ్మాయటనుచును

ప్రభువు తిరిగి వచ్చు పండువందు

60.

అర్ధ మాసమందు నక్టోబ్రు పదునైదు

తేది నాడు మేరి దిగులు జెందె

ముప్పుతిప్పలాయె మూడు గంటల టైము

ఆపరేషనాయె నామెకమ్మ

61.

ప్రభువు నడుగుచుండ పద్దెనిమిది తేది

పుట్టినట్టిరోజు పుణ్యదినము

తల్లి మరణమగును నెల్లూరు లోనిక

పరువు లెత్తుమనుచు ప్రభువు పల్కె

62.

రైలునెక్కి నేను రయ్యిన బోతిని

అమ్మ చివర శ్వాస కుమ్మెమదిని

చిన్న గుఱ్ఱుగాని, ఎన్నొ సైరనులట్లు

చెవులు దిమ్మిరెక్క చేతమదిరె

63.

క్రుంగునపుడు ప్రొద్దు, క్రుంగిపోయెను తల్లి

గుండె సంద్రమగుచు కూలినాను

కవిని ప్రక్కబెట్టి, క్రైస్తవునిగ నేను

ప్రభుని చేతికిడితి ప్రార్ధననుచు

64.

తండ్రి, అక్క, బావ, తమ్ములెల్లరుగూడ

చేరి అమ్మవద్ద బోరుమనిరి

గుండె గట్టుకొంటి గుట్టుగా నెట్టులో

కంటినీటినెల్ల కనుల దాచి

65.

గుండె చెరువుకెన్నొ గండ్లు బడినయట్లు

అక్క తమ్ములెల్ల నంగలార్ప

కుళ్లి కుళ్లి యేడ్చె కుమిలిపోవుచు నాన్న

కంటనీరు గారె కనులు లేవు

66.

కలిసికొనెను డాని కడకైన నినుజూచు

భాగ్యమబ్బెననుచు బావురనెను

వాని జూడ నాకు వచ్చును దుఃఖమ్ము

దేవుడేసు వాని గావుగాత!

67.

పెట్టెలోన నిన్నుబెట్టియు గుడివద్ద

దండ లెన్నొవేయ దండిగాను

విజయవాడ మామ, వేంకటేశ్వర మామ

అక్క యనుచు కనులు నొక్కుకొనెను

68.

అమ్మ యనెడి కావ్యమంకితం బిడితిని

పెట్టెలోనబెట్టి గుట్టుగాను

చింటు, చిక్కు, జాషు చిన్నారి నావారు

శాలువాను గప్పిసాగనంపె

69.

బాల్య మిత్రురాలు బహు తీపిబంధమ్ము

ముద్దులిడుచు గుండె గుద్దుకొనియె

ఎంత ఏడ్చెనమ్మ ఎస్సీవొ కాంతాంటి

పొదలకూరు మదిని మెదలనేమొ

70.

సరస హ్రదయురాలు సర్రోజినత్తమ్మ

కాఫి టీల నిచ్చె కాసి కాసి,

వారి చలువ వలన వాకాడునందున

నిన్ను బూడ్చినాము మన్నుగప్పి

71.

పూడ్చినాము నిన్ను, పూడ్చలేమే ప్రేమ

హృదయమందు నీవు మెదలుచుండ

పాతిపెట్టలేము పాత సంగతులెన్నొ

గుండె గోరి లోని గురుతులెన్నొ

72.

మనుజులెవరు నాదు మదిలోని దుఃఖమ్ము

చూడగూడదనుచు నేడ్వలేదు

ఏడ్వలేదె, అమ్మ నెత్తినంతవరకు

ఒక్కసారి దుఃఖ మెక్కువాయె

73.

గుట్టుగానె నేను గుడిలోని కేగుచు

ఏసుసామి వద్ద నేడ్చుచుండ

దూరెనొకడు నాదు దుఃఖమ్ము జూచెను

వాని కథయు వింత వస్తువగును

74.

అన్నదమ్ముడేమొ 'ఆనందు ' డనుకొందు

నల్గురున్ననేమి? నాన్నగార్కి

ఆపరేషనప్పుడన్నియు జేసెను

స్వంత కొమరుడటుల వింతగాదె

75.

అన్ని జెప్పె నాన్న ఆనందు సేవలు

ఋణపడితిని వాని ఋణము దీర్చు

మనుచు బల్కి నాన్న ఆనతి నివ్వంగ

కనులు లేని తనకు కనులు దడిసె

76.

కనులు లేని నాన్న కంటినీటిని జూచి

కరిగి నాదుగుండె కాల్వలయ్యె

ఇస్మయేలు పుల్లనిచ్చెను పోస్టును

తండ్రి ఋణము దీర్చు తనయుడైతి

77.

వాని బ్రతుకు మారె వచ్చెనుద్యోగమ్ము

బ్రతుకుదెరువు కొరకు బాటయొకటి

కాని తీర్చలేను వాని ఋణమ్మును

సేవకట్టి గొప్ప చేవ గలదు

78.

చేతికఱ్ఱ నొకటి ప్రీతిగా 'జో' యిచ్చె

ననుచు నెన్నిమారులంటివమ్మ

కఱ్ఱ మూలజేరి కనబడకుండగ

చాటు వాని ప్రేమ చాటునుండి

79.

నిండుగాను వ్రాసె రెండు పేజీలకు

'జో' తలంచి నిన్ను చూడవమ్మ,

అతను దిగులుజెందె నమెరికా దేశాన

మదిని నీదు ప్రేమ కుదిపివేయ

80.

వచ్చినప్పుడెల్ల, వానిని బోనీక,

బువ్వబెట్టి పంపు బుద్ధి నీది

కన్నతల్లివోలె, కడుపును జూతువు

నిర్మలమ్ము నీదు నిండు ప్రేమ

81.

పక్షవాతమునను పడకన బడ్డప్పు

డెంత బాధజెంది ఏడ్చినావొ

తలచుకొన్న గుండె కలచివేయును తల్లి

మనసు మూల్గుచుండు మాటరాక

82.

వేలుబెట్టి వ్రాసి 'సాలు ' పేర్పలు మార్లు

చూపినావు అక్క చూపు బెదర

పుట్టకుండ వాడు, బొప్పాయి కాయలన్

తినినమాట, మదిని తిరిగెనేమొ!

83.

'రాజు ' పేరులోన రాణించుచున్నది

నిజముసాల్మనుండు నిజము రాజు

చిన్ననాటనుండి, చింతలు లేకయే

రాజఠీవి బ్రతుకు రాజువాడు

84.

వ్యానులోన నిన్ను వాకాడు గొనిపోవ,

పక్కలోన 'శాము ' పండుకొనియె

ప్రాణమొదలి నీవు పలకవు-ఉలకవు

వాని గోడు నన్ను ఙ్ఞాని జేసె

85.

అక్క నిన్నుజూచె నంతమ్ము వరకును

పుణ్యవంతురాలు పుట్టె నీకు,

బావగారు మాకు బంగారు భాగ్యమ్ము

అమ్మవోలె జూచునమ్మ నిన్ను

86.

మేలు దొరికె మాకు మేర్మెర్సి వసుకుసు

దిగులు జెందకమ్మ దివిని నీవు

కన్నుమూయవెపుడు కాయుచు కొమరుల

మరచిపొమ్ము మాదు మాటయింక

87.

నాన్నగారి జూడ, నాగుండె చెరువౌను

బ్రతుకు భారమయ్యె బ్రతుకు చివర

ఏసు సామి తనకు నెటులైన బలమిచ్చి

తట్టుకొనెడు గుండె బెట్టు గాక!

88.

కనులు మూసుకొన్న కనులు తెరచుకొన్న

ప్రతి నిమేష మందు పవలు రేయి

అమ్మ నీదురూప మచ్చముగా నదే

కాను పింప దిగులు కరుడుగట్టు

Read Book in English

PART 1

1.

She hugged her just born to her heart

A Warm touch to me, to her own part

I couldn’t open my eyes but could see

My Mother’s love, wider than the sea

2.

She tore her sari and made a bed

When I was a little bud

If needed she will tear her heart

Mother’s love will never depart

3.

Though a Mother in the child’s bed

All the dirt, she cleansed my bed

4.

I cried and cried, she sang and sang

Fed me with her milk and again she sang

5.

I kicked her but she kissed my legs

Always for my safety, Almighty she begs

6.

In sleep, whenever I babbled

In her heart, she was troubled

7.

She rocked me, till I slept in my cradle

A sweet feeling that I am on the saddle

Before I woke up, she was awake always

She spent for me, many a sleepless days

8.

She neither slumbers nor sleeps

Day and night into my cradle, she peeps

How can she close her eyes

When I live in her eyes

9.

I cried and she thought

An ant entered my ears

Or a pain in the stomach

Or something she fears

10.

She smiled when I smiled

And cried when I cried

The unknown secret in God’s hand

This relationship is a natural bond

11.

Unable to speak some sounds I mutter

Little, tender, blossoming words glitter

My Mother’s happiness knew no bounds

“My son got words” crossed the bounds

12.

She called me my love, my honey, my dear

To kiss me, she comes very near

Embraces me and talks with the eyes

When I say ‘Hoo’ she melts like ice

13.

She forgets herself and becomes a child

Just to play with her child

How she reduces her age is the wonder

Really to play and act like a tender

14.

My first steps are about to fall

Unable to walk, I crawl

Mother’s Love is pure

She holds me secure

15.

A daily routine after her dawn

She plays with me on the lawn

Showing the moon feeds with a spoon

My Mother’s love is really a boon

16.

A minor hurt to my head

One or two drops of blood

For help neighbours she pleads

My mother’s heart bleeds

17.

I played in the Tub

The waters spread like a Web

I was completely wet

But my Mother never beat

18.

In dust and mud I play and loiter

She cleansed me with lot of water

19.

Swimming, my father did not allow

Secretly my Mother sent me with Love

20.

Fighting ‘Dishum Dishum’ childish

My Mother set me right by ‘Hush’

21.

From boyhood to youth I have grown

To the sweet blossoming imagery I was prone

Young girls liked me and my curly hair

As a fence my mother took a lot of care

22.

She guarded me with her infinite eyes

From the useless boys, who loiter unwise

23.

Her muscles became pieces of sticks

Still washes my clothes, on the rock she strikes

My young muscles and mind suffer a lot

To see her working, a miserable thought

24.

My pocket money is from my Mother

But never from my father

Affection and Love with Mother

Shivering and fear with father

25.

To second show cinemas, I went

Many sleepless nights she spent

She never sleeps till I return

If my father sees, I will be beaten

26.

Into others quarrels whenever I peep

My Mother stops me, Her love is deep

27.

When I went for higher studies to Town

Unable to hide tears, she looked down

She followed me to the railway station

With tears her heart became an ocean

28.

During holidays when I went home

She fed me and her love was same

Her belly is filled, when she fills my belly

It’s true. But to hear, it may be silly

29.

She applied castor oil to the crown of my head

She thought still I am a little kid

She will not leave me if I say ‘NO’

Mother’s love who can know

30.

She says my son has grown up

Seek a girl and go for a trip

Marriage is father’s responsibility

Winning with my father, is her ability

31.

My marriage was fixed with dealings

My mother moved with mixed feelings

She was excited and runs here and there

May be worried about my future’s care

32.

Not on the ground, moving dare

Her speed is like walking in the air

Ordering my maternal uncle, she calls

To make a wedding shed of palm leaves

33.

She told good about me, to those who stood

To neighbours who knew me from my childhood

34.

All relatives have come in advance

Whitewashed my house, while children were in dance

35.

Ladies were asked by mother’s sweet tune

To prepare a Mango Leaves Festoon

36.

Sweets and hots in plenty prepared

While serving to relatives, all are cared

Mother’s mind is full, when they eat full

Mother’s heart, which son can fulfill

37.

She praises as if she knows

The qualities of her would be daughter-in-law’s

38.

She was afraid of heat

Gave cool drinks to beat the heat

I was restrained to smoke and puff

To step out of the house was tough

39.

During Marriage everything was nice

Number of eyes were searching for lovely eyes

I found a flow from my Mother’s eyes

Perhaps thinking of me and our ties

40.

Marriage is a sweet memory in life

I got a beautiful wife

Parents made lot of loans

A burden, without cheque bounce.

41.

I swam in the ocean of love

Newly wedded wife is like a lovely dove

With her daughter-in-law she is not jealous

My mother is always pious

42.

She writes letters with tears

I never reply without any fears

She wrote again and again

Her love is like a benevolent rain

43.

We are blessed with a child

My mother is so mild

She came to serve her grandson

And took the same care on her son

44.

Fragrance of Frankincense i.e., Benzoin

Was burnt for me and my son

My son to me is like her son to her

Though Father’s and Son’s age differ

45.

The child grew a little and mumbled

While Mother-in-law and daughter-in-law grumbled

Both speak seeing the wall indirectly

My Mother went to her house directly

46.

Again we were blessed with a child

My mother returned to her fold

United, forgetting all old quarrels

Both were singing Christmas carols

47.

In vacation we went to our mother’s village

She embraced us on the roads of the village

She kissed me, my wife and my children

Her innocent love is always over my children

48.

Though age was advancing, she did work

She gets angry when I say not to work

But forgets within a minute and again works

In her own way she always works

49.

A passionate had cut his Mother’s heart

To win his deluded lover’s heart

His Mother’s heart pleaded in bleeding

“My son you might slip and hurt with bleeding”

50.

Mother’s love knew no bounds

Which son can repay her affections

When each atom of the son

Is his own Mother’s, but none

PART-2

51.

For the last time I touched my Mother

And felt an unknown dart

The places where I swam

As foetus; squeezed my heart

52.

Unconscious for three days she suffered

The sound of breath “Gurr”…. was heard

Which squeezed our suffering hearts

Mother is going to Heaven. She departs

53.

The lips that kissed me when I was a child

Excel the penance of a sage in a forest wild

And like a still sea, her lips appear

Which stabs my heart with a spear

54.

With folded hands she prays the Lord

She rejects to pray with a single hand

Thus she travelled her last journey

With a paralytic stroke, leaving her Johnny

55.

Coconut water as oral feeding is given to her

To see that scene our hearts wither

She fed me morsels of rice with ghee

Memory of my childhood moved like a violent sea

56.

Inspiring generations as a source

She fought a good fight and finished her course

When your grand children ask for you

How can we tell, we are without you

57.

She speaks truth, though it may take her life

She is God fearing, loving and kind in her life

Her life is exemplary to all mankind

It’s true that to all, she was always kind

58.

Your plain heart and strong determination

Is an eye opener to the present generation

God’s grace is upon you and in you

Yourself, you are Christianity, that’s you

59.

We can’t utter the word Mother

We are Motherless, where is our Mother?

But we certainly call our Mother

On the day of Resurrection , we will see our Mother

60.

One thousand Nine hundred Ninety Third year

Middle of the Month Fifteenth October

Mary has undergone Operation

For three hours, creating tension

61.

In my life October Eighteenth is a Special Day

I heard God’s voice on my Happy Birthday

“Johnson I am going to take your Mother

Leave your wife and go to your Mother”

62.

I’ve dashed to Nellore in the Train

My Mother’s last breath dashed in vain

A hard deep breath that’s a fearful snore

Dashed our ears like Sirens sore

63.

My Mother collapsed along with the sun

I have fallen as my heart became an ocean

Not as a poet, but as a devotee of Christ

I handed over my Mother to my Lord Jesus Christ

64.

Father, Sister, Brother-in-law and Brothers

Cried at the coffin along with others

I have hidden all my tears in my eyes

And controlled myself with confidence

65.

Number of holes to the Tanks like hearts

To my sister and Brothers when my Mother departs

Grieving, sorrowing with agony my father cried

A blind man’s tears on coffin ride

66.

At last arrived my brother Daniel

Oh Mother! To see you lying still

His tears flowed and touched your feet

May God bless him. Alas! his fate

67.

At the Church they kept you in a coffin

Number of garlands on your heart soften

Vijayawada Uncle, Venkateswara Uncle

Crying, my sister, my sister became dwindle

68.

My poetry on Mother is dedicated to you

By keeping in the coffin along with you

Chintu, Chikku and Joshu my children

Covered you with a shawl. Innocent children

69.

Childhood friend came in a cart

Kissed you and thumped her heart

Kanthanti’s cry reached the skies

May be Podalakur touched her memories

70.

Sarojinamma, my beloved Aunt

Served to all, coffee and tea

You are buried in Vakadu

A memorable place is Vakadu

71.

We have buried you but not the love

For ever in our hearts you live

Can’t bury the memories in the grave

My heart itself became a grave

72.

I didn’t cry so that others may not know

Sorrow in my heart, which I know

The coffin started to the graveyard

And my tears drenched the graveyard

73.

I entered the Church before the coffin left

In front of my Lord Jesus Christ, I wept

An intruder entered the Church, my tears he saw

His interesting story cuts the heart with a saw

74.

His name is Anand, who served my father

At the time of Operation, as my brother

We are four sons to our father

But failed to serve like this brother

75.

My father told me the services of Anand

And said he is indebted to Anand

My Father ordered me to help this brother

I found tears from the blind eyes of my father

76.

After seeing the tears of my father who is blind

My heart melted and flowed, touching my mind

Sri Ismail Pullanna gave a job to Anand

I repaid my father’s due to Anand

77.

Anand’s life is changed with a new job

Just a way of livelihood is his job

But I can’t repay him. It’s true

Service has strength like the heart of a tree

78.

Joe presented a stick to walk

About Joe many a time you talk

The stick is thrown to a corner now

Which proclaims his selfless love

79.

A letter of two pages, Joe wrote

Thinking of you forever to note

In the United States, he worried a lot

Your benevolent love moved his heart

80.

Whenever he came to our house

You served him all dishes with rice

Like own Mother you took care

Your love towards all is pure

81.

With a paralytic stroke in the bed

How much you suffered and cried in the bed

My heart bleeds when I think about it

I become silent and alone I sit

82.

With finger you wrote Salu’s name

Perhaps imagining his future fame

Papaya fruit you ate, to avoid his birth

Or have you predicted his early death

83.

King in his name shines as a King

That’s Raju in Telugu, Solomon Raju, a King

Royal life he led from his birth

Without any worry till his death

84.

After your death when we took you to Vakadu

Samu slept beside you up to Vakadu

You neither move nor speak, leaving this world

His agony made me wise and bold

85.

My sister took care of you till the last

A good daughter and a very good host

My Brother-in-law serves coffee of ‘Bru’

He loved you like his Mother is true

86.

Mary, Mercy, Vasu and Kusu, we got

Forget your sons. Don’t become hot

Take rest at least in Heaven

We’ll meet you in the Heaven

87.

In this old age my Father suffers

To be alone always he prefers

We can’t pressurize him and insist

May God grant him a heart to resist

88.

Though I close or open my eyes

Day and Night you are in front of my eyes

My heart bleeds and agglomerates

How can I bear my agony and pain that rotates

Download Book in Telugu