జీవిత సత్యాలు - Truths of Life

Read Book in Telugu

జీవిత సత్యాలు

1.

సూర్యుని క్రిందను జరుగు సమస్తము వ్యర్ధము

అన్ని క్రియలు వ్యర్ధము అదియే పరమార్ధము

2.

మానవ మాత్రులు వీరు తెలియదయ్య-అభము-శుభము

నరులు పడెడి పాటు వలన వారి కేమి లాభము?

3.

తరము వెంట తరము తరము తరలి పోవుచున్నది

తరల కుండ భూమి నిలచి నరుల దరుము చున్నది

4.

గాలి, సూర్యుడు, నదిలా ఙ్ఞానము తిరుగాడును

పాత తరము ఙ్ఞానమునే నేటి నరుడు వాడును

5.

విస్తారమైన ఙ్ఞానము విస్తారమైన దుఃఖము

అధిక విద్యయైనచో అధికమైన శోకము

6.

సంపదలు-ఉపపత్నులు సంతోషపు లీలనీకు

గాలి కొరకు ప్రయాసము గాలి మాట లేల నీకు

7.

కోట్లు కోట్లు బెంచినాను కొల్ల గొట్ట సుఖము

అణువైనా తృప్తి లేక అల్లాడె నఖశిఖము

8.

చీకటి కంటె వెలుగు ఎంత ప్రయోజనమ్ము

బుద్ధిహీనత కన్న ఙ్ఞాన మంత ప్రయోజనమ్ము

9.

అఙ్ఞానికి, ఙ్ఞానికిని దరిద్రమ్ము పోదు

సంతసమును మించునట్టి సంపదయే లేదు

10.

తనకిష్టమైన వాని కివ్వ భగవంతుడు కనిపెట్టు

ప్రయాసపడి పోగుజేయ పాపిష్టికి పనిపెట్టు

11.

పుట్టుటకు, గిట్టుటకు కట్టుట, పడగొట్టనుంచె

దేనికాల మందు దాని దేవుడు నియమించె

12.

నిండు జీవితమ్ము శ్రమలు కొండ లాగ కష్టరాశి

నిద్రాహారాలు వరము ఉండవలెను నొసట వ్రాసి

13.

జరిగినట్టి సంగతులె మరల జరుగుచుండును

ముందు జరుగ బోవునది పూర్వమందె యుండెను

14.

న్యాయస్థానముననే దుర్మార్గత జరుగును

దీనుల దీనత జూచి దేవుని గుండే కరగును

15.

మనుజులకు, మృగములకు ప్రాణమ్ము ఒక్కటే

మట్టి లోన బుట్టి మరల మట్టి లోకి నక్కుటే

16.

బలహీనుల నిపుడు పిండు బలవంతులె రాజన్యులు

పుట్టి చనిన, పుట్టనట్టి పుణ్యాత్ములె ధన్యులు

17.

రోషము వలన కష్టము రెండింతలు బెరుగును

గాలిని బట్టుట కొకడు బుద్ధిలేక తిరుగును

18.

గాలిని బట్టెదననుచు తూలి పోయె ముఖము

నెమ్మది గలిగిన జాలు నిమ్మళముగ సుఖము

19.

'నా' అను వారే లేరు దిక్కులేక ఒక్కడే

కూడు దినక కూడబెట్టు సమాధి పెట్టెనెక్కడే

20.

గుడికి బోవునపుడు నీదు నడవడి జాగ్రత్తసుమ్మి

నోరుజారి దేవుని కోపానికి గురికాకు తమ్మి

21.

మొక్కుబడిని చెల్లించి చక్కని దీవెనలు పొందు

మొక్కుకొనకు మివ్వలేక మాట తప్పబోకుమెందు

22.

ధర్మము వీడి పేదను బాధ పెట్టు అధికారి

అధికారికి అధికారిగలడు దేవుడందిరిపై అధికారి

23.

భూమిని గూర్చిన శ్రద్ధ ఏ దేశమందు విందును

అన్నిటి యందు మేలు ఆ దేశమె పొందును

24.

చూసి మరియు దాని కన్న చేసేదేమున్న దన్న

ధనము బెంచు దాని వలన తృప్తియన్న మాటసున్న

25.

ధనము బెరుగ నిదుర రాదు తనయుండెదిరించును

కష్టజీవి గంజిద్రావి కమ్మగ నిదురించును

26.

దిగంబరిగ పుట్టి నరుడు దిగంబరిగ చచ్చును

స్థిరాస్థులు, చరాస్థులు పరులవి గావచ్చును

27.

వేళకింత బువ్వ, నిద్ర తండ్రి బెట్టు తరతరము

హృదయానందము గూడ దేవుడిచ్చు వరము

28.

ధనధాన్యమ్ములు బెరిగెను తనకేమి తక్కువ

అనుభవించు అదృష్టం అన్యులకే ఎక్కువ

29.

నూరేళ్ళు బతికి సుఖము లేక నూరుగురిని కనెను వీడు

పడిపోయిన పిండము గతి వాని కన్న మేలు చూడు

30.

అడియాశలు గలిగి తిరుగు ఆశబోతు వాని కన్న

ఎదుటనున్న దానిని అనుభవించు వాడెమిన్న

31.

విందు జరుగు గృహము కన్న విలపించెడి యింట వ్రాలు

ఒకని జన్మ దినముకన్న మరణదినమె మేలు

32.

నవ్వుట కంటెను గూడ దుఃఖ పడుట సుఖము!

హృదయమునే గుణ పరచును ఖిన్నమైన ముఖము

33.

చిట పటయని బాన క్రింద చిటుకుల మంట

బుద్ధిహీనులందరిదీ నవ్వు అట్టి దంట!

34.

ధనమును ఙ్ఞానమ్మును ఆశ్రయాస్పదము

ఙ్ఞానమున్న చాలు అది ప్రాణపదము

35.

సుఖదినమున మానవుడు సంతసముగ పాడును

ఆపద్దినమున వానిని ఆలోచన కాపాడును

36.

నీతి మంతుడొక్కడైన నేలపైన గానరాడు

నరులందరు పాపాత్ములు పరమాత్ముడె జాలిపరుడు

37.

మరణము కన్నా దుఃఖము మరి యొక్కటి యున్నది

మరులు గొల్పి ఉరులు వేయు మాయలాడి చిన్నది

38.

యధార్ధ వంతునిగా నరుని జేసె దయామయుడు

వివిధమైన తంత్రములను కల్పించుకొనెను నరుడు

39.

ఙ్ఞానము ముఖమునకు తేజస్సును ఇచ్చును

దాని వలన మొరటు తనము పారి పోవచ్చును

40.

ధర్మమును కాపాడుము ధర్మమె నిను కాపాడును

దేవదూత నీ నీతిని దేవునెదుట పాడును

41.

సంభవించ బోవునది గుంభనమ్ము పైపైన

మరణ దినము తెలియునా మనుజుని కెవ్వని కైన?

42.

భయము భక్తి గలుగు వాడు క్షేమముగా బ్రత్రుకును

దుష్టుడు, దుర్మార్గుడు కష్టములనె గతుకును

43.

దివా రాత్రులు కన్నులు నిద్రలేక మేలుకొన్న

ఙ్ఞానియైన జరుగునది పసిగట్ట లేడన్న

44.

స్నేహమైన, ద్వేషమైన మనుజుల వశమున లేదు

దైవమెపుడొ నొసట వ్రాసె వారి వలన కాదు

45.

బ్రతికియున్న వారిపైన ఆశయున్న జాలు

చచ్చిన సింహముకంటె బ్రతికి యున్న కుక్కమేలు

46.

అన్న పానములకన్న ఆనందపు మార్గమేది?

ప్రియమైన భార్యతో ప్రేమకన్న స్వర్గమేది?

47.

వ్యర్ధమైన ఆయుష్కాల మంతటికీ లాభమట

ప్రేమించెడి భార్యతోడ సుఖించుటే శోభయట

48.

చేతనైన పనులు చేయి చేయకున్న మరల రావు

పనియు తెలివి ఉపాయమ్ము పాతాళము నందు లేవు

49.

బలముండియు గెలువలేరు బువ్వలేదు, బుద్ధిమెండు

అదృష్టము చేతనే అన్నియు ప్రాప్తించుచుండు

50.

ముట్టడి పిమ్మట వాడు ఙ్ఞాపకముకు రాడుగాని

పట్టణమును కాపాడెను పనికి రాని పేదఙ్ఞాని

51.

బుక్కాతైలమున ఈగ చచ్చి కంపు గొట్టు

బుద్ధిహీనతింత యున్న ఙ్ఞానమునే తేలగొట్టు

52.

ద్రోహమునే తప్పించెడి ఓర్పును విడనాడకుము

అధికారులు కోపపడిన ఉద్యోగము వీడకుము

53.

దాసుడు రాజాయెనేని దేశానికి అశుభము

గొప్పయింట బుట్టువాడు రాజగుటయె శుభము

54.

ఉదయముననె నిద్రలేచి తిండి దినుట అశుభము

అనుకూల సమయమందు తినుటయే బలము శుభము

55.

ధనము వృధా జేయువాడు దరిద్రుడుగ చచ్చును

అన్నింటికి ద్రవ్యము అక్కరకు వచ్చును

56.

ధనవంతుల, రాజులను మనసునైన శపింపకు

పక్షులె గొనిపోవు వార్త మదినెపుడు తలంపకు

57.

ఆశ్చర్యము, ఆస్తి బెరుగు తన భాగము పంచి పెట్టు

పెట్టి పుట్టినట్టి వాడు పదిమందికి బువ్వబెట్టు

58.

పిండ మపుడు బిడ్డ ఎముక లెటుల బెరుగు చెప్పుకొనుము

దేవుని క్రియలు మనకు తెలియవని ఒప్పుకొనుము

59.

చెయ్యి వెనుక తియ్యకుండ పొద్దు పోవు వరకు

విత్తనముల విత్తుము ఏది బెరుగు చివరకు?

60.

వెలుగు జూడ మనోహరము చీకటి దినములు గలవు

సంతోషము గొప్ప వరము దానితోనె బ్రతుక గలవు

61.

యవ్వనమ్ము నందు జేయు కవ్వింతల విందు

తెచ్చునయ్య దేవుడు నీ తీర్పు దినమునందు

62.

దుర్దినములు రాకముందె దుఃఖ పడకయుండు

బాల్యమందె భక్తియున్న బలము గలుగు మెండు

63.

రెండవ రాకడ రోజున గుండె బగిలి పోవును

భయంకరమైనవి కన్నులెదుటె పోవును

64.

మన్నయినది వెనకటివలె మరల మన్నయి తీరును

ఆత్మ దాని పంపిన పరమాత్మ దరికి జేరును

65.

ప్రసింగియె పలికిన ఙ్ఞానమును సత్యమిది

ఇంపైన మాటలు నింపు కొనుము నీ మది

66.

పుస్తకములకేమిలే మస్తుగా బుట్టును

విస్తారమైన చదువులు ఆరోగ్యము బోగొట్టును

67.

మానవ కోటికి విధి సర్వ ఙ్ఞాన సత్యమిది

దేవునినే నిత్యమ్ము నిలుపుకొమ్ము నీమది

Read Book in English

Truths of life

1.

All that happens under the sun is vanity

Vanity of vanities, all is vanity

2.

What profit hath a man

He that struggles from the dawn?

3.

Generation after generation passes away

But the earth abides to open the death way

4.

Wisdom wandereth like river, wind and the sun

It is, it was. No new thing is done under the sun.

5.

Much wisdom is much grief

Much knowledge is sorrow in brief.

6.

I got concubines, singers, silver and gold,

It was nothing and I became old.

7.

Accumulating wealth is not merit

But it's vanity and vexation of spirit.

8.

Wisdom excelleth folly

As light excelleth darkness.

9.

The Wise and the foolish are always poor

But happiness and contentment knock their door.

10.

God gives, whom He loves deep

A difficult task for sinners to heap.

11.

Time to be born, to die, to build and break

In the Lord's hand time is a brake.

12.

Oh! Travail and Troubles some suffered

But happiness and enjoyment some preferred.

13.

Now, that which hath been, is seen

And which is to be, hath already been.

14.

Wickedness reigns and iniquity gains in judgement

But saving the innocent is God's judgement.

15.

For men and beasts, death is a must

All is vanity and returns to dust

16.

Men in power, suppress the oppressed

The dead and the unborn are blessed.

17.

Travail and hard work for the envious spirit

All is vanity and vexation of spirit.

18.

Much ado about nothing is restless

Better is a handful with quietness.

19.

Alone he lives and none for him

All his savings are not for him.

20.

Be not rash with thy mouth before God

Keep thy foot when goest to God

21.

Pay that which thou hast vowed

Receive the blessings from God

22.

Oppression of the poor and violent prevaileth

But God that is higher than the highest regardeth

23.

The king himself is served by the field

For all profit of the earth is a shield

24.

Gold and Silver is nothing

Except gazing at it, it's nothing

25.

The gift of hard labour is sound sleep

But the rich suffer without sleep

26.

Naked in birth, naked at death

Riches and Wealth are swept away in a breath

27.

For generations God provides timely food and timely sleep

The joy of the heart is the gift of the Lord, we reap

28.

He has riches, wealth and food

But all these are a stranger's bread

29.

Long life and many children, but no peace

A still born or unborn is better than his case

30.

Better is he, who enjoys within his reach

A greedy, desires and wanders, but can't reach

31.

Join the mourning, than the feasting mirth

Better is the day of death than the day of birth

32.

Repentance makes a heart better

Sorrow is better than laughter.

33.

For the laughter of the fool is hot

As the crackling of thorns under a pot

34.

Money and wisdom both a defence for life

But wisdom alone giveth life

35.

Be joyful in the day of prosperity

But think and consider in adversity

36.

No just and good on the earth

Except God, all sinneth

37.

The trap of a woman is mirth

But it is bitter than death

38.

God hath made a man upright

But his tricks are ugly in His sight

39.

Wisdom brightens a Man's face

And changes its hard appearance

40.

Obey the commandments and Judgement of God

From evil things God will safeguard

41.

No man has power over the spirit

The day of death who can predict

42.

All is well for them that feareth God

A sinner does evil, without fear of God

43.

No man knows, what happens under the Sun

Even if the wise claims he knows, its in vain

44.

Love or hatred not the man's deed

All deeds are God made

45.

Between the living and the dead I draw a line

Living dog is better than a dead lion

46.

Eat thy bread and drink thy wine more

Enjoy with thy wife whom thou lovest more

47.

All life is vanity under the sun

But enjoy with thy beloved wife, my dear son

48.

What ever you do, do it with thy might and be brave

Neither work nor knowledge nor wisdom are in the grave

49.

Battle to the strong and bread to the wise, not at all

Not the skill but time and chance happen to all

50.

A poor man's wisdom delivered the city

But no man remembered him. Its a pity.

51.

Dead flies cause the ointment stink

Folly striketh the wise and the king

52.

Let the Ruler shout, leave not thy place

Yielding pacifieth great offences and patience pays

53.

The servant's kingship never ennobles

Blessed is the land when king is from Nobles

54.

Timely food for strength is well known

But the foolish eat before the dawn

55.

Feasts and laughter makes you empty and loiter

Money answereth all things and its a supporter

56.

Curse not thy king even in thought

Birds carry thy voice and thought

57.

Serve thy bread to the poor and the needy

Thou shall find thy assets growing speedy

58.

Thou knowest not how the bones groweth in the womb

Thou knowest not the works of God till thy tomb

59.

Sow the seed from morning till evening

Thou knowest not which will be progressing

60.

Life means the days of light and darkness

Rejoice, rejoice and live in happiness

61.

Oh! Young lest thy heart cheer thee in enjoyment

But for all these things God will bring thee in judgement

62.

Evil days are ahead. Thou know the truth

Remember thy Creator in the days of thy youth

63.

Heart breaks on the day of the Second Coming

All fears in the way. Its nearing

64.

Dust is our body, returneth to earth as dust

And the spirit should return to God is a must

65.

The preachers words, the truth is acceptable

Fill thy heart with words which are respectable

66.

Looks on books. Oh! Books, books many books

On your health they are all hooks

67.

Conclusion of the whole matter is the matter

Fear God and keep His commandments are the matter

Download Book in Telugu and English